Sunday, April 10, 2016

బీజం (Beejam)

మట్టిలోని బీజం మొక్కై చిగురించి 
భూమి సారంగా కాంతికి తలవంచి
అందానికి ప్రతిరూపంగా పుష్పాలు వికసించి
ఆహ్లాదమిచ్చి మనిషి అవసరాలు తీర్చి
బాటసారికి నీడనిచ్చే పచ్చదనంతో పాటు
గిజిగాడికి గూడుకట్టే చెట్టుకొమ్మ చోటు
రూపాయికోసం పడే కసాయి గొడ్డలి వేటు
జడివానకి తోడయ్యే హోరుగాలి పోటు
నిమ్మకు నీరెత్తినట్టు అన్నీ తట్టుకునేది చెట్టు! 

ఎన్నో మార్పులు పొందే ఈ బీజం మనిషి నైజం
వేళ్ళని మరిచిన క్షణం మనిషిలో మిగిలేది అహం
ఈ అనంతర విశ్వంలో నీ అహం ఎంతటి సూక్ష్మం!
దుఃఖమొచ్చినప్పుడు దేవుడ్ని దూషిస్తే
'నాకే జరగాలా?' అని కష్టంలో ప్రశ్నిస్తే
చేసే ప్రతి పూజకి ఏదో వరం ఆశిస్తే
నీ నమ్మకాన్ని అమ్మకానికి పెట్టినట్టే!

స్వలబ్ధికై అర్ధిస్తే ప్రారబ్ధి మారుతుందా?
సృష్టికర్త శిక్షా ? సహనానికి పరీక్షా?

నీ బాధలు బంధాలు విధాతకి తెలియనివా?

భక్తి కర్మ ధ్యానం కావాలి నిష్కామ్యం
మనిషి ప్రయాణంలో నిరంతర పోరాటం
కేవలం తనని తాను తెలుసుకునే ప్రయత్నం!
నీ పయణంలో నువ్వు వేసే ప్రతి అడుగు
ఎటువైపుగా వెలుతుందో నీ మనసుని అడుగు
తిమిరాంధకారం తొలగితే అది జ్ఞానం
బీజమే నిజమని గ్రహిస్తే నీవే శివం! 

**lyrics in tenglish**

mattiloni beejam mokkai chigurinchi
bhoomi saarangaa kaanthiki thalavanchi
andaaniki pratiroopamga pushpaalu viskasinchi
aahlaadamichhe manishi avasaraalu theerchi
baatasaariki needanichhe pachhadanam tho paatu
gijigaadu goodukatte chettukomma chotu
jadivaanaki thodayye horugaali potu
rupaai kosam pade kasaai goddali vetu
nimmaku neeretthinattu anni thattukunedi chettu!

yenno maarpulu pondhe ee beejam manishi naizam
vellani marichina kshanam manishilo migiledi aham
ee ananthara viswamlo nee aham yenthati sookshmam!
dukhamochinappudu devudni dooshiste
'naake jaragaala?' ani kashtamlo prasniste
chese prati poojaki yedo varam aasiste
nee nammakaanni ammakaaniki pettinatte !
swalabdhikai ardhiste praarabdhi maarutundaa?
sristhikartha sikshaa? sahanaaniki pareekshaa?
nee baadhalu bandhaalu vidhaathaki theliyanivaa?

bhakti karma dhyaanam kaavali nikshaamyam
manishi prayaanamlo niranthara poraatam
kevalam thanani thaanu telusukune prayatnam !
nee payanamlo nuvvu vese prati adugu
yetuvaipugaa velutundo nee manasuni adugu.
thimiraandhakaaram tholagite adi gnaanam,
beejame nijamani grahiste neeve sivam !


Saturday, March 29, 2014

Nee Sontham

నీ సొంతం 

ఒంటరితనంతో సౌదా చేసి,
ఆకాశాన్నంటే సౌధాలలో ఉంటూ,
నిశీధిలో శూన్యం చూస్తూ,
నిశరాత్రిలో నిశ్శబ్దం వింటూ,
చుట్టూ ఉన్న చీకట్లను కళ్ళల్లో దాచుకుంటూ,
నీ భయాలు, సంశయాలు ఎదుర్కుంటూ,
అడగని ప్రశ్నలకి జవాబు అన్వేషిస్తూ,
దొరకని జవాబుని పదేపదే ప్రశ్నిస్తూ,
గడచిన రోజుని నెమరవేసుకుంటూ,
పడుకుంటూ.. తరచూ మేలుకుంటూ.. 
రాజీ పడని  రోజు రేపొస్తుందనుకుంటూ 
ఆశగా నీవు ప్రతిరోజు గడుపుతావు. 

కలలో ఆశలు నెరవేరడం సహజం, 
ఆశలు కలగా మిగిలిపోవడం నిజం.. 
నీ ప్రయత్నం లోపించిందా అని ప్రశ్నించక,
ఓటమిని సహించక, నిజాన్ని గ్రహించక, 
సమయం లేదని సమర్దించుకుంటూ 
ఇవ్వాళ కుదరదు 'బిజీ' అనుకుంటూ 
'తరువాత చూద్దాం.. సర్లే చేద్దాం'
అని నీతో నువ్వు రాజీ పడిపోకు... 
కష్టం అనుకుంటే నీ ఇష్టాన్ని వదులుకో,
శ్రమ అనుకుంటే నీ భ్రమ తొలగించుకో 
అసలేం కావాలో అది నిర్ణయించుకో !
నిలకడ లేని నీ మనసుకి,
మనుగడ గురించి అంత ఆలోచన దేనికి?
మనసుంటే మార్గం ఉంటుంది మిత్రమా,
ప్రయత్నించు.. పోరాడితే పోయిందేముంది ?

మనసు మనసుకి దూరాలు 
మనిషి మనిషికి విభేదాలు 
'ఎలా ఉన్నావు' అని అడిగే చిరునవ్వు 
కనుమరుగయ్యిందని గుర్తించు నువ్వు. 

బలహీనుడ్ని లూటి చేసి,
ప్రపంచం అది పోటి అంటుంది. 
నీ ప్రమేయం లేకుండా పరిగెత్తిస్తుంది
పోటి ప్రవాహంలో నిన్ను ముంచేస్తుంది 
నీ ఆశను, ఆశయాన్ని నిర్దేశిస్తుంది.
నువ్వు గెలిస్తే నీ వెంటొస్తుంది 
నువ్వోడితే 'ఓస్.. ఇంతే' అంటుంది 
వందల మందలో నిన్ను ఒంటరి చేస్తుంది. 
మరి నలుగురి మెప్పుకోసం ఈ తపన దేనికి?
గెలవడమంటే కేవలం గుంపులో నడవడమా? 
లేదా నీ దారిలో గమ్యానికి చేరి ఉనికి చాటడమా?
జీవించడం అంటే స్వేచ్చని పాటించమని మంత్రం 
నీ తప్పు, నీ ఒప్పు, నీ పంతం, నీ సొంతం. 

-కొన 
మార్చ్ 30, 2014


Friday, November 11, 2011

ఏడు అడుగుల దూరం

మన పరిచయమే ఒక పుస్తకమై,
ప్రతి అనుభవం ఒక జ్ఞాపకమై,
అపురూపమైన నీ రూపాన్ని దాచి, 
రాసే ఈ అక్షరాలే మన సాక్ష్యాలు   

ఏడు అడుగుల దూరంలో, 
విధాత ఆటకి విడిపోయాము 
కాని, చివరికి మిగిలే మన ప్రేమలో, 
ఓడిపోయి కూడా మనం గెలిచాము 

గతముతో నేను సతమతమవుతూ,
ఒంటరిగా ఎన్నో క్షణాలు గడిపాను.
ఆపుకోలేని అశ్రువులతో తడిచి,
ఈ యెదలో నా వ్యధ దాచాను. 

దేవుడినే ద్వేషించాలి,
తలరాతనే దూషించాలి.
నమ్మలేని నిజాన్ని మరిచి,
నీ కలలో ఇక జీవించాలి. 

నా మౌనంలో నీ సంతోషం ఉందని,
ఈ హృదయానికి సర్దిచెబుతాను.
నవ్వే నివ్వెర పోయేలా,
నీ కోసం నవ్వుతూ ఇక బ్రతికేస్తాను.

 - కొన
PS: Dedicated to a beloved friend

Saturday, February 20, 2010

Nireekshana - II

నిరీక్షణ - II

'నేస్తం', అంటూ నా కోసం
నీ స్నేహం జత చేసావు.
నాకే తెలియని, ఇక ఫై మరువని
నడకను నాకే నేర్పావు. 

 
తీరం అంతు ఎంతైనా,
అలలకు అలసట కలిగేనా ?
మన దూరం కరిగిన నా
కలలకు నీ ఊహే అందెనులే.

చెదిరిన కల మన గతమైనా ,
చెరగని రూపం నీదేలే .
పెదవులపైనా చిరునవ్వైనా
కలిగిన అది నీవేలే...

గెలుపు ఓటమి తేడా తెలియని
చెలిమే మనలో చిగురించేనా.
పసిపిల్లలమై మనసులు తడిసిన,
ఇరువురి కనులే చమరించేనా.

మౌనం కూడా మన భాషేనా ?
హృదయం తొంగి చూస్తుంది.
తెలుపని మాటలు ఎన్నో ఉన్నా,
మన భావం ఒక్కటయ్యింది.

చలనములేని క్షణములు ఎన్నో
సరసకు రమ్మని పిలిచేలే...
రోజు నీకై వెతికే కనులకు ,
జన్మంతా ఇక నిరీక్షణలే.....

-కొన

PS: This is a sequel to the poem "Nireekshana" which I wrote 4 yrs ago. Appreciate if you could drop your comments.

Monday, May 01, 2006

ANTHAM

అంతం
ఆంతులేని ఆకాశంలో స్వేచ్చగా ఎగిరిన విహంగం
హరివిల్లు తాకిన వేళ పులకరించెను ప్రతి అంగం
గూడు విడిచి పోయినా అది అంబరం అందిన సంబరం
లోకం లోని అందం కోసం అది మరిచెను గత బంధం


సరికొత్త పరిచయం లోని కల్మషం
ఎరుగక చేసెను అది స్నేహం
కల్లాకపటం తెలియని ప్రాణి
మార్చుకో ఇక నీ బాణి

నీ మాటలోని తియ్యదనం ఉంటుందా ఈ లొకాన ?
నీ ఆలోచనలోని గొప్పతనం సరితూగేనా ఎవరికైన ?
నీ అనురాగం నిశ్వార్ధం ! అడివిగాచిన వెన్నలేనా ?
నీ చెలిమే ఒక యోగం ! ఆగుమిత్రమా ఇకనైన

నీ గూడు లోన పరికించు,
తరగిపొని ఆస్థి దాగుంది.
ఈ స్వప్నాన్ని ఇక కరిగించు,
తిరిగిరమ్మని గుండె అంది.

ఓ బాటసారి ! నీ ప్రస్థానంలో చివరి మజిలి ఏది?
చూడు ఒక్కసారి ! ఈ ప్రపంచంలో అసలు నకిలి ఏది?
ధుఖ్ఖాన్ని సైతం దరహాసంతో స్వాగతించె సఖ్యము నీది ,
హృదయం లోన నిన్ను గెలిచే మనుషుల్లో ఔన్నత్యం ఏది?

నిజము కాని కల ఇది
కలలో అస్సలు నిజము లేనిది.
తీరని మృగతృష్ణ ఇది
ప్రయాస చేసినా ఫలితం లేనిది.

సూర్యుడి కోసం ఆరాటమా ! రెక్కలు కాలి అలమటించేనా !
కరుణ చూపిన వరుణుడు కన్నీటి జడివాన కురిపించేనా !
వెలుతురు కన్నా వేగంగా చీకటే పయనించేనా !
చావు బ్రతుకుకి భేదం లేక అంతా ఒకటే అనిపించేనా.

నీ గూడు మాత్రమే నీ సొంతం ,
జాడ మరువకు ఏ మాత్రం.
ఎవరికొసమే నీ పంతం ?
అంతే తెలియని ఈ అంతం

-కొన
Anthuleni aakasamlo svechhaga egirina vihangam
Harivillu thaakina vela pulakarinchanu prathi angam.
Goodu vidichi poyina, adhi ambaram andina sambaram
Lokam loni andam kosam ,adhi marichenu gatha bandham.

Sarikottha parichayam loni kalmasham,
Yerugaka chesanu adhi sneham.
Kallakapatam theliyani prani,
Maarchuko ika nee baani.

Nee maataloni thiyyadanam untunda ee lokaana?
Nee aalochanaloni goppathanam sarithugena
yevarikaina?
Nee anuraagam nisvaardham! adivigaachina vennelena?
Nee chelimey oka yogam! aagumithrama ikanaina.

Nee goodu lona parikinchu,
tharagiponi aasthi dhaagundhi.
Ee swapnanni ika kariginchu,
thirigirammani gundey andhi.

O baatasaari! nee prasthaanamlo chivari majili yedhi?
Chudu okkasaari! ee prapanchamlo asalu nakili yedhi?
Dhukkanni saitham dharahaasamtho swaagathinchey
sakhyamu needhi,
Hrudhayam lona ninnu gelichey,manushullo aunnathyam
yedhi?

Nijamu kaani kala idhi,
kalalo assalu nijamu lenidhi.
Theerani mrigathrishna idhi,
Prayaasa chesina falitham lenidhi.

Suryudi kosam aaratama! rekkalu kaali alamatinchena!
Karuna chupina varanudu,kanneti jadivaana
kuripinchena!
Velthuru kanna vegamga, cheekatey payanichena!
chaavu brathukuki bhedham leka,antha okate
anipinchena.

Nee goodu maathramey nee sontham,
Jaada maruvaku ye maathram.
Yevarikosamey nee pantham?
Anthey theliyani ee "ANTHAM".

- Kona
My explanationvariety ga nenu kavitha maathrame kaakunda oka kavi ela feel ayyi rasthado cheppalani idi oka chinna prayaasa..atleast nenu ee ANTHAM raayadaniki reason meetho share cheyyalanipinchi cheptunna..

firstly, adi raasina time lo i was trying for a reunion of my schoolmates..after 6 yrs i cud bring them to a common platform and started a alumni..but in the end i found xept for few there was so superficiality in every being.nenu 100% act ayithey vallu 1% kuda react avvale ani aalochisthunna rojulu..i thot all that feeling for them was crap and the only true feeling is to feel for our own home..

secondly,one day lab lo oka practical chestuntey oka pedda exit fan lo oka paavuram padi daani rekkalu cut avvadam chusa..so aa incident inka naa feeling relate chesthu rasindi ANTHAM..a fullstop to external feeling and be yourself..

oka paavuram thana goodu vidichipoyi lokamlo kottha bandhaala vetaloki vellindi..danni kavi vaarinchi aagamani cheppey prayathnamey ANTHAM..indulo naaku nachhina lines

Suryudi kosam aaratama! rekkalu kaali alamatinchena!
Karuna chupina varanudu,kanneti jadivaana
kuripinchena!
Velthuru kanna vegamga, cheekatey payanichena!
chaavu brathukuki bhedham leka,antha okate
anipinchena.


andaarani suryudi kosam prayathnam chesi rekkalu kaali padipoyindi aa paavuram..jaali padi varuna devudu kanneti varsham kuripinchaadu..veluthuru poyi cheekati vasthey thana manta thagguthundani cheekati velthuru tho poti padi munduku vellindi.(where there is dark there is light..so technically dark is faster than light..ha ha)..

adandi nenu anukunna feeling..idi chadivaka oka saari malli aa kavitha chadivi chudandi..mee opinion lo emaina change untademo..


GAMYAM

గమ్యం
మనిషి కోరికల ప్రతిబింబం
గెలుపే పొందని చదరంగం
అడుగడుగున అడుగును మనసు
ఎచటికి ఈ ప్రస్థానం ?
జవాబు ఆ విధాతకే తెలుసు
విధించినాడీ అవరోధం

మౌనంతో పోరాడిన ప్రాణం,
మౌనంగా ఓడిన వైనం
కాలం చూస్తుంది దయనీయంగా,
హుషారు ఆకలి షికార్ల నైజం

ఆకలి అరుపులు ఊపిరి పోసి,
చీకటి చరుపులు తోడుగ నిలచి
చేస్తున్నాయా కరాలనృత్యం?

కాలమే కాటువెస్తుంటే
కాటికేనా ఈ పయణం?
నిరాసతో సంచరిస్తుంటే
నింగికెగసేను నా గమ్యం
-కొన

Manishi korikala pratibimbam
gelupe pondani chadarangam
adugaduguna adugunu manasu
echatiki ee prasthaanam ?
javaabu aa vidhaatake thelusu
vidhinchinaadee avarodham
Maunamto poraadina praanam,
maunamga odina vainam
kaalam choostundi dhayaneeyangaa,
hushaaru aakali shikaarla naizam
aakali arupulu oopiri posi,
cheekati charupulu toduga nilachi
chestunnaayaa karaalanrityam?

kaalame kaatuvesthunte
kaatikena ee payanam?
niraasatho sancharisthunte,
ningikegasenu naa gamyam


-Kona


PS: idi na 6 yrs b4 kavitha..IIT lo i cant make it emo ani baadapaduthunna rojulalo raasinadi..appudu situation alaantidi lendi..but finally i made it :)

NEEVU

నీవు

ఎదలో ఎన్నో భావాలు, ప్రాణం పోసే రూపాలు
ప్రతి కణం , అనుక్షనం ప్రతిధ్వనించే రాగాలు
చెప్పాలని ఉన్నా, గొంతు విప్పాలని ఉన్నా ఎందుకీ మౌనం?
నిజం తెలుసుకున్న ప్రాణం, మార్చునురా నీ నైజం




నిరాశను వీడి చూడు ఒక్కసారి,
రహదారిలో నడిచిచూడు బాటసారి
గమ్యం తెలిసిన పయణం రా నీది,
జీవితం నేర్పిన  పాఠాలే పునాది

ఎవరో ఏదో అనుకుంటారనె ఆలోచనే అసలొద్దు,
మనసు చెప్పిందే వినరా, నింగే నీకు సరిహద్దు.
కృష్నుడు లేని కురుక్షేత్రం లో ఒంటరి వాడివి నీవేలే,
జననం మరణం సహజం రా, విజయం మాత్రం నీదేలే.

చెరగని కలలే నీకుత్సాహం,
పడిలేచే అలలే నీకాదర్శం.
విజయం తోనె నీ బాంధవ్యం,
ప్రగతి పధం లో నీ భవితవ్యం

రెక్కలు వచ్చిన విహంగం లా, గగనం లో విహరించు
అంతే తెలియని తీరంలో, మునుముందుకే పయణించు
ఆంధ్యము తరిమి, వేకువ నింపే ప్రమిదవు రా,
ఉజ్జ్వలంగా ప్రజ్జ్వలించి కరిగిపోయే సమిదవురా.

ఎందరో ఆప్తులు ఉండగ ఈ వేళ,
కాసులరాసులతొ పని నీకేల ?
మమతే కరువై, మనసే బరువైన నాడు,
లోకం శూన్యం, అల్లకల్లోలం చూడు.

ఆగకపొంగే కన్నీళ్ళే కనబడకుండా దాచాలి,
హర్షించే వర్షం మాదిరిగ ఆకలి దప్పులు తీర్చాలి
నష్తాన్ని సైతం మరిపించి,కష్తాన్ని కూడ మురిపించు
వెతల స్మృతులు వదిలేసి, దరహాసపు వడిలో పవళించు

ఎదురు బెదురు లేదు, లేదు నీకు పోటి
లోకంలోనా, లోకుల్లోనా నీవేరా సరిసాటి
తలరాతని నమ్మే నిశ్చేస్టుడివి కావు,
తనరాతని రాసే నరేషుడివి నీవు
-కొన


edalo enno bhaavaalu, praanam pose roopaalu
prati kanam , anukshanam pratidhvaninche raagaalu
cheppaalani unnaa, gontu vippaalani unnaa endukee maunam?
nijam telusukunna praanam, maarchunuraa nee naizam
niraasanu veedi chudu okkasaari,
rahadaarilo nadichichoodu baatasaari
gamyam telisina payanam raa needi,
jeevitam nerpina paathaale punaadi

evaro edo anukuntaarane aalochane asaloddu,
manasu cheppinde vinaraa, ninge neeku sarihaddu.
krishnudu leni kurukshetram lo ontari vaadivi neevele,
jananam maranam sahajam raa, vijayam maatram needele.

cheragani kalale neekutsaaham,
padileche alale neekaadarsam.
vijayam tone nee baandhavyam,
pragati padham lo nee bhavitavyam

rekkalu vachchina vihangam laa, gaganam lo viharinchu
anthe teliyani teeramlo, munumunduke payaninchu
aandhyamu tarimi, vekuva nimpe pramidavu raa,
ujjvalangaa prajjvalinchi karigipoye samidavuraa.

endaro aaptulu undaga eevela,
kaasularaasulatho pani neekela?
mamathe karuvai, manase baruvaina naadu,
lokam soonyam, allakallolam choodu.

aagakaponge kannille kanabadakundaa daachaali,
harshinche varsham maadiriga aakali dappulu teerchaali
nashtaanni saitam maripinchi,kashtaanni kuda muripinchu
vetala smrutulu vadilesi, darahaasapu vadilo pavalinchu

eduru beduruledu, ledu neeku poti
lokamlona, lokullona neeveraa sarisaati
talaraatani namme nischestudivi kaavu,
tanaraatani raase nareshudivi neevu

-KONA

My views
idi 1yr kritham naa meeda nenu raaskunna poem.. panchedriyaalanu raayiga marcheyvaadu rushi, rayiga unna prapanchaanni ahalyaga malichevaadu manishi..manishi manishini ardham cheskovalantey mundu thananu thaanu ardham cheskovadam avasaram..to realise urself completely..i belive this is the biggest achievement in life..infact anni philosophies lo cheppey final moral idey kada..awaken and listen to ur inner voice etc ani..

nee gurinchi nuvvu raaskunnavu..antha goppavaadiva ani comment cheyyochhu..avunu nannu nenu poorthiga ardham cheskunna..naa lopalanu thelsukunna..no one is perfect kani kaneesam mana limitations ni ardham cheskuntey verey vallatho ela masalu kovaalo thelusthundi..for greater wellbeing of human relationships..ee thoughts def ga overnight lo raavu..naaku kuda konni months aalochinchaaka realise ayyinave..also mana meeda manaki confidence undaali ye pani cheyyalanna..aa nammakam naalo uppangey rojulalo raasina kavithey ee NEEVU..ippatiki kuda when i m down with confidence okkasaari ee poem chaduvutha..anthey malli charge ayyi ye panaina poorthi chestha..indulo rasina prathi line naa jeevitha anubhaavalavey..poem meaning ki vasthey..

manasulo yenno bhaavalu unnayani, naalo anuvanuvu anukshanam edo cheppalani prathadvaninchey raagalu..entho introspection tharvaatha thelsinavani adi cheppey time vachhindani first stanza lo cheppa.
Niraasanu veedichudu okkasari....jeevitham nerpina paathale punadi..i had many bad xperiences in life..so chaala depressed ga helpless ga undeyvaadini..kaani was always waiting for a moment to raise from the embers of pain and prove myself..aa kasthaale naalo kasini penchaayi..oka matured manishi ga malichaayi..
Evaro edo anukuntaaraney...usually mana bhaavalu andari mundu unchaalantey chaala uneasy ga untundi..adi siggu vallaney kaadu mana meeda manaki nammakam lekapovadam valla..selfconfidence vachhinappudu evaro edo anukuntaarani feel avvakarle..air ur opinions openly!!
Cheragani kalale neekuthsaaham..padi lechey alaley neekadarsam..paiki yegase alalu kaadu avi kindha padi levadame goppa...vati ninchi manam pondey spoorthi chaala goppadi..inka naa baata thiruguleni gelcihey baata ani..lines obvious gaaney unnayi kada..
Rekkalu vachhina vihangam laa..innallu antey edo bhayam tho isolate ayyi unna kaani ippudu svechha ga aakasam loki rekkalu vachhina pakshila vihranchamani..cheekatini pogatti veluthuru ninpe pramadivani..unnannallu verey vallaki cheyandisthu karigipommani..nenu nammey sookthi..naluguruki chesey ye pani cheddadi kadani..
yendaro aapthulu undaga ee vela...chakravarthiki veedi bichhagatthiki banduvathaanani andi money money..puttadaaniki paadi kattadaaniki madhya antha thaaney andi money money...Money movie lo ee sirivennala song viney vuntaaru..mana puttina degara ninchi kontha mandi tho associate avuthaam kaani life lo tharvaatha money ani, success ani,vallani marustham..kasula rasulu(money) kaadu mukhyam, mana relations ani..avi lekapothey jeevitham soonyam ..
Aakaga pongey kannelliey..naaku naa kasthalani verey vallatho panchukovadam istham undadu..share ur joy with others and keep ur tears with urself..others dont like them anyway..andukey yenni kasthalunna okka chirunavvutho anni maripinchamani ,kasthaalani kuda muripinchamani cheppa.
Yeduru beduru ledu..ledu neeku poti..chaala mandi thana success ni verey vallatho compare cheskuntaaru..adi only thama value thakkuva anukunnappudu chesey pani..asalu mana absolute frame lo manam undi mana gelupu otamilanu manamey introspect cheskuntey inka ye problem undadu..thalaraathani nammey 'elaa raasuntey alaa avuthundi' ani loser statements anakunta mana meeda mana nammakam unchi munumunduku saagalani, alaanti vaadey ee Naresh(narulalo eeshudu..king )..

So meeru kuda mee capabilities ni ardham cheskondi..oka attitude unna manishi ga brathakandi..Never look back!!

Wednesday, February 15, 2006

Nireekshana..

నిరీక్షణ

మార్పులేని నా తూర్పు వాకిలి లో

 హ్రుదయం లేనిది ప్రతి ఉదయం.
నీ రాకతో నన్ను చేరె తొలికిరణం,
నీ నవ్వుతో వాలెను జాబిలిసైతం.
 

చెలిమిగా నాతో చేయికలిపావు
చిలిపిగా నాతో తగువులాడావు.
నీతో గడిచిన ఆ ప్రతిక్షణం
జీవితమంతా ఇక స్మ్రితిపదం.

నువ్వంటే ఇష్టం ఉన్నా,
మౌనంగా మది అది స్నేహం అంది.
గుండె చప్పుడులో నీ పేరు విన్నా!
ఈ కొత్త అలజడిలో ఎదో దాగుంది.

అర్దం కాని అద్బుతం అది
కోకిలకందని రాగం అది..
కవితలు పలకని భావం అది
కలయో నిజమో తెలియకున్నది.

అణువంతే నా యెదలో ఉన్నా,
తనువంతా తానే అంది.
కరగని స్వప్నంలా చేరుకున్నా,
తరగని సిరిలా నాతో ఉంది.

నడయాడే దీపం తన రూపం
ప్రక్రితిలో లేనిది ఆ అందం.
నన్నే నేను మరిచిన తరుణం
నా మనసుకి నాతో కొత్త పరిచయం.

చిటపట చినుకుల ధ్వనిలోన,
నీ చిరునవ్వే నే విన్నా.
గలగల మెరిసిన మెరుపులోన
నీ పిలుపే నను చేరేనా!!

చెంతచేరి అంత దూరమైనావు
దూరమై మరింత చేరువైనావు.
క్షణం క్షణం అనుక్షణం
నీ కోసమే ఈ నీరీక్షణం.


--కొన
14 Feb '06